mini moon భూమికి రెండో ఉపగ్రహం కాబోతోంది. కొన్ని రోజులు కనిపించదు
భూమికి ఎన్ని సహజ ఉపగ్రహాలు అంటే.. చంద్రుడు ఒక్కడే కదా అని అంతా చెబుతాం. అయితే, ఇప్పుడు మరో ‘‘మిని చంద్రుడు’’ కూడా చంద్రుడికి తోడుగా రాబోతున్నాడు. కొన్ని రోజుల పాటు భూమికి రెండు చంద్రులు ఉండబోతున్నారు. ఆదివారం రాత్రి నుంచి ఈ ‘‘మిని మూన్’’ భూమి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. ‘‘2024 PT5’’ అని పిలవబడే ఇది కేవలం పది మీటర్ల వ్యాసం కలిగిన ఈ చిన్న చంద్రుడు, 53 రోజుల పాటు భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతాడు. ఆ తర్వాత సౌర కుటుంబంలోని సుదూరాలకు వెళ్తాడు.
ఇది మన చంద్రుడితో పోలిస్తే 3,50,000 రెట్లు చిన్నది. చంద్రుడి వ్యాసం 3476 కి.మీ., మిని చంద్రుడి వ్యాసం కేవలం 10 మీటర్లు మాత్రమే. సాధారణంగా ఇది కంటికి కనిపించదు. ప్రత్యేకమైన టెలిస్కోపులతో చూడాల్సి వస్తుంది. తెల్లవారుజామున వీలైనంత వరకు 1.30 గంటల తర్వాత దానిని గుర్తించవచ్చు. ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టదని నిర్ధారించారు. ‘‘మినీ మూన్’’ భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో దాదాపుగా రెండు నెలల పాటు పరిభ్రమిస్తుంది. సెప్టెంబర్ 29 నుంచి దాదాపు 2 నెలలు భూమి చుట్టూ తిరుగుతుంది.
ఈ గ్రహశకలానికి హిందూ ఇతిహాసం ‘‘మహాభారతం’’తో సంబంధాలు ఉన్నాయి. అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ (RNAAS) యొక్క రీసెర్చ్ నోట్స్‌లో ప్రచురించబడిన ఒక నివేదికలో, శాస్త్రవేత్తలు 2024 PT5 యొక్క కక్ష్య లక్షణాలు ‘‘అర్జున ఆస్ట్రాయిడ్ బెల్ట్’’ నుండి వచ్చిన గ్రహశకలాలను పోలి ఉన్నాయని చెప్పారు.
అర్జున అనేది