కర్ణాటక పశ్చిమ కనుమల్లో.. 3,800 అడుగుల ఎత్తులో: దీపావళికి మాత్రమే తెరచుకునే ఆలయం

కర్ణాటక పశ్చిమ కనుమల్లో.. 3,800 అడుగుల ఎత్తులో: దీపావళికి మాత్రమే తెరచుకునే ఆలయం

కర్ణాటక రాష్ట్రం చిక్కమగళూరు జిల్లా పశ్చిమ కనుమల్లోని దేవీరమ్మ బెట్ట ఆలయానికి దీపావళి సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఈ ఆలయం ఏటా దీపావళి రోజున మాత్రమే తెరుస్తారు. శేషాచల్ పర్వత శ్రేణుల్లో 3,800 అడుగుల ఎత్తున కొండపై ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడం భక్తులకు సాహసమే.

దట్టమైన అడవి మధ్య ఉండే ఈ ఆలయానికి చేరుకోవడానికి మెట్ల మార్గం ఉంది. ఆలయం చుట్టూ అనేక చిన్నచిన్న జలపాతాలున్నాయి. మిగిలిన రోజుల్లో ఈ ప్రాంతం మొత్తం అటవీశాఖ ఆధీనంలో ఉంటుంది. దీపావళి రోజున మాత్రమే భక్తుల కోసం ఆలయ గర్భగుడి తెరుస్తారు.

అమ్మవారిని దర్శించుకునేందం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా భక్తులు వస్తుంటారు. దీపావళి రోజున ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

దట్టమైన అడవిలో కొండపై ఉండటంతో ఆలయానికి చేరుకునే దారి చాలా కఠినంగా ఉంటుంది. అయినా సరే భక్తులు మాత్రం కాలినడకన, వాహనాలపై తరలివస్తుంటారు. కొందరు భక్తులు.. తమ పూర్వీకులు కోరిన కోర్కెలు తీర్చినందుకు గుర్తుగా.. కొండపై నుంచి దిగుతూ మార్గమధ్యలో 80 అడుగుల ఎత్తు నుంచి దూకేందుకు కూడా సిద్ధపడతారు.

ఏటా దాదాపు లక్ష మందికి పైగా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ఇక్కడ పూజలు కొనసాగుతాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అధికారులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

కర్ణాటకలో దీపావళి రోజు మాత్రమే తెరచుకునే అమ్మవారి ఆలయం: పోటెత్తిన భక్తులు, దారిపొడవునా వాహనాల రద్దీ

కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లాలోని దేవీరమ్మ బెట్ట ఆలయానికి దీపావళి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. శేషాచల్ పర్వత శ్రేణుల్లో 3800 అడుగుల ఎత్తున కొండపై ఉన్న ఈ ఆలయం ఏటా దీపావళి రోజున మాత్రమే తెరుస్తారు.

శనివారం దీపావళి పర్వదినం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచేకాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు గంటల తరబడి క్యూల్లో వేచిచూశారు.