గూగుల్‌కి బిగ్ షాక్.. ఓపెన్ ఏఐ కొత్త బ్రౌజర్ "అట్లాస్" లాంఛ్ !
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రస్తుతం ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ప్రజల్లో ఈ సాంకేతికతను విస్తృతంగా పరిచయం చేసినది ఓపెన్‌ఏఐ రూపొందించిన చాట్‌జీపీటీ అని చెప్పాలి. చాట్‌జీపీటీతో ప్రపంచ టెక్ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్‌ల మధ్య యుద్ధం నడుస్తోంది. ఈ యుద్ధంలో ఓపెన్‌ఏఐ మరో అడుగు ముందుకు వేసింది. AI-పవర్డ్ సెర్చ్ ఇంజిన్‌తో మైక్రోసాఫ్ట్ బింగ్‌ను టెక్ జెయింట్ గూగుల్‌కు పోటీగా నిలిపింది. ఇప్పుడు ఓపెన్‌ఏఐ "అట్లాస్" అనే కొత్త వెబ్ బ్రౌజర్‌ను ఆవిష్కరించి గూగుల్‌కు షాక్ ఇచ్చింది.
ఓపెన్‌ఏఐ వెబ్ బ్రౌజర్ "అట్లాస్"
ఓపెన్‌ఏఐ కొత్త వెబ్ బ్రౌజర్‌ను అభివృద్ధి చేస్తోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, ఈ బ్రౌజర్‌కు సంబంధించిన వివరాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఇప్పుడు ఓపెన్‌ఏఐ "అట్లాస్" అనే వెబ్ బ్రౌజర్‌ను విడుదల చేసింది. ఈ బ్రౌజర్‌తో పాటు AIతో పనిచేసే కొత్త సెర్చ్ ఇంజిన్‌ను కూడా ఆవిష్కరించింది. ఈ రెండు యాప్‌లు ప్రస్తుతం ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే, కొద్దిమంది మాత్రమే వీటిని వాడగదు. ఎందుకంటే.. ఓపెన్‌ఏఐ యాప్ స్టోర్‌లో అప్‌లోడ్ చేయకుండా వాటిని టెస్ట్ చేస్తోంది. టెస్టింగ్ పూర్తయ్యాక యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంచుతుంది.
కొత్త ఓపెన్‌ఏఐ వెబ్ బ్రౌజర్‌తో వినియోగదారులు నేరుగా యాప్ లోపలే AI చాట్‌బాట్‌తో చాట్ చేయొచ్చు. ప్రశ్నలు అడగొచ్చు. ఇది చాలా వరకు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌లోని AI ఫీచర్‌ను పోలి ఉంటుంది. ఈ బ్రౌజర్‌తో వినియోగదారులు సమాచారాన్ని మరింత వేగంగా పొందొచ్చని ఓపెన్‌ఏఐ పేర్కొంది. కొత్త బ్రౌజర్‌తో వినియోగదారులు వారి వెబ్ ఎక్స్‌పీరియన్‌ను మెరుగుపరచుకోవచ్చని తెలిపింది. ఓపెన్‌ఏఐ కొత్త బ్రౌజర్‌లో కొన్ని ఆసక్తికర ఫీచర్లను అందుబాటులో ఉంచింది.