ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్, వారికి ఈ నెల జీతం కట్..!!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్ జారీ అయింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల జీతం కట్ అయ్యే అవకాశం ఉందని ఆర్థిక శాఖ జారీ చేసిన సర్క్యులర్ లో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కొన్ని షరతులు విధించింది. అవి తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. లేకపోతే జీతాలు నిలిపివేస్తామని హెచ్చరించింది. తెలంగాణ ఆర్థిక శాఖ ఈమేరకు ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యదర్శులు, హెడ్‌లకు ఉద్దేశించిన ఈ సర్క్యులర్‌లో.. ఉద్యోగుల నుంచి కొన్ని వివరాలు తీసుకోవాల్సి ఉందని, అవసరమైన సమాచారాన్ని ఇంకా సమర్పించని వారికి ఈ నెల జీతం రాదని పేర్కొన్నారు. కాబట్టి, వారి జీతాలను నిలిపివేయాలని స్పష్టం చేశారు. అలాగే, కొత్త పింఛను విధానం కింద ఇప్పటికే వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం తమ వివరాలను అందిస్తున్నామని, లేదా లేదని ఆఫ్‌లైన్ ద్వారా తెలియజేయాలని కోరారు.

ఉద్యోగులకు NPS అమలుకు సంబంధించి.. న్యూ పెన్షన్ స్కీమ్ అమలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. జాతీయ పెన్షన్ వ్యవస్థ(ఎన్‌పీఎస్) కిందకు వచ్చే ఉద్యోగుల వివరాలను ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాలని స్పష్టం చేసింది. 2017 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చిన ఎన్‌పీఎస్‌ను పూర్తిగా అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్రంలో గతంలో 2004 డిసెంబర్ 31న, లేదా అంతకుముందు ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ స్కీమ్ అమలు అవుతోంది. అలాగే, 2005 జనవరి 1, లేదా ఆ తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి ఎన్‌పీఎస్ అమలు అవుతోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎన్‌పీఎస్‌కు వచ్చే వారు దాదాపు లక్ష మంది.

తెలంగాణ ఆర్థిక శాఖ ఈ సర్క్యులర్‌లో మరింకొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ప్రస్తావించింది. ఉద్యోగులందరికీ జీతాలను ఆయా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని స్పష్టం చేసింది. గతంలో జీతాల బిల్లులను ఆఫ్‌లైన్‌లోనే పంపితే సరిపోయేది. అయితే, ఇప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసి, ఆ తర్వాత బిల్లులను సమర్పించాలని స్పష్టం చేసింది.

PRIS(పెన్షన్ అండ్ రెమ్యునర