పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు- జమ

కేంద్ర ప్రభుత్వం.. దేశ రైతుల కోసం అమలు చేస్తున్న పథకాల్లో ప్రధానమైనది.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం కిసాన్) పథకం. ఈ పథకం కింద.. దేశ రైతులకు ఏటా రూ.6 వేలు ఆర్థిక సాయం చేస్తోంది. మూడు విడతలుగా ఇస్తున్న ఈ ఆర్థిక సాయం.. ఎందరో రైతుల కుటుంబాలకు అండగా నిలుస్తోంది. ఇప్పటికే 20 విడతల నిధులు వారి ఖాతాల్లో జమైయ్యాయి. ఇప్పుడు 21వ విడత నిధుల విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.







unnamed-2

నవంబర్ మూడో వారంలో పీఎం కిసాన్ 21వ విడత నిధులను విడుదల చేసే అవకాశం ఉందని.. అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు బదిలీకి సిద్ధమవుతున్నట్లు వెల్లడించాయి. ఇప్పటికే దీనికి సంబంధించి సిద్ధం చేసిన జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. ఈ ఏడాది మూడో విడతగా రైతు ఖాతాల్లోకి.. రూ.2 వేలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో రైతులంతా.. తమ ఖాతాలో పీఎం కిసాన్ నిధులు అందుతున్నాయా? లేదా? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే దేశంలోని 11 కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం.. పీఎం కిసాన్ నిధులు అందజేసింది. ఇప్పటివరకూ దాదాపు రూ.2.25 లక్షల కోట్లకు పైగా ఈ పథకం కింద రైతుల ఖాతాల్లోకి బదిలీ చేసింది. అయితే.. కొందరు రైతులకు మాత్రం ఇంకా ఈ నిధులు అందలేదు. దీనికి కారణాలను వెతకాలంటే.. వారి దరఖాస్తులోని లోపాలే అందుకు కారణమని తేలింది. అయితే వీటిని సరిచేసుకోవడం ద్వారా.. రైతులు తమకు రావాల్సిన నిధులను పొందే అవకాశం ఉంది.

ఇప్పటికే దేశంలో ఎంతోమంది రైతులకు.. పీఎం కిసాన్ పథకం కింద ఆర్థిక సాయం అందుతోంది. దీనికి అర్హులైన రైతులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, భూమికి సంబంధించిన పత్రాలు, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు మొదలైనవి సమర్పించాల్సి ఉంటుంది. ఈ పథకం కిందకు.. ఏ భూమి హక్కుదారు అయినా.. దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దీనికి కొన్ని అర్హతలు కూడా ఉన్నాయి.