తండ్రి శత్రుఘ్న సిన్హా నివాసం నుంచి బయటకొచ్చిన తర్వాత ముంబయిలో బాంద్రాలోని ఓ అపార్ట్ మెంట్ లో ఎంతో ఇష్టపడి, కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో కొనుక్కున్న ఇల్లు అది.
అక్కడితో అయిపోలేదు. అదే ఫ్లాట్ లో ఆమె జహీర్ ఇక్బాల్ తో డేటింగ్ చేసింది. అందులోనే వాళ్లిద్దరి వివాహం కూడా జరిగింది. ఇలా ఆమె కెరీర్ తో, వ్యక్తిగత జీవితంతో పెనవేసుకున్న ఫ్లాట్ అది.
4200 చదరపు అడుగుల సువిశాలమైన ఆ ఫ్లాట్ ఇప్పుడు అమ్మకానికొచ్చింది. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఆ ఫ్లాట్ ను వీడియోతో సహా సేల్ కు పెట్టింది. ఆ పోస్టును సోనాక్షి లైక్ కొట్టింది కూడా.
4 బెడ్ రూమ్స్ తో సముద్రానికి అభిముఖంగా, 26వ అంతస్తులో ఉన్న ఈ ఫ్లాట్ ను గతేడాది కొనుగోలు చేసింది సోనాక్షి. తన అభిరుచికి తగ్గట్టుగా దగ్గరుండి ఇంటీరియర్ కూడా చేయించుకుంది.
ఇప్పుడా ఇంటిని 25 కోట్ల రూపాయలకు అమ్మకానికి పెట్టింది. సోనాక్షికి అంత కష్టమేమొచ్చిందంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.