Manu Bhaker video: డ్యాన్స్‌తో అదరగొట్టిన ఒలింపిక్ విజేత మను భాకర్

|| || || Leave a comments
Manu Bhaker Shakes A Leg On Kala Chashma Song Video Breaks Internet

ఒలింపిక్స్ విజేత మను భాకర్ డ్యాన్స్‌తో సందడి చేశారు. స్కూల్‌లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేసింది. కాలా చష్మా పాటపై మను భాకర్ ఒక కాలు కదిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


పాఠశాలలో మను భాకర్‌కు సత్కారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో ఆమె తన తల్లితో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా కాలా చష్మా సాంగ్ ఫ్లే అవుతుండగా విద్యార్థినులతో కలిసి డ్యాన్స్ చేసింది. వెనుక కూర్చున్న తల్లి చప్పట్లతో ప్రోత్సహించింది. అలాగే స్టేజ్ కింద ఉన్న ప్రేక్షకులు కూడా మొబైల్‌లో చిత్రీకరించారు.


పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో మను భాకర్ రెండు పతకాలు సాధించింది. సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి పతకాలు సాధించింది. మను భాకర్.. పారిస్ నుంచి భారత్‌ చేరుకున్నాక.. అన్ని రాజకీయ పార్టీల నేతలను కలిసి పతకాలు చూపించింది. ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, సోనియా గాంధీని కలిసి ఒలింపిక్స్ విశేషాలు పంచుకుంది.