అయితే ఇప్పుడు ఆమె మృతి చెందారు. ఇటీవల ఆమె మరణించినట్టుగా మరియా కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇదిలా ఉంటే మరియా మరణంతో ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా జపాన్‌కు చెందిన టొమికా ఇటూకా(116ఏళ్లు) ఆ స్థానాన్ని దక్కించుకున్నారు.
జపాన్‌కు చెందిన టొమికా ఇటూకా వయసు 116 సంవత్సరాలు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో టొమికా ఇటుకా చోటు సాధించారు. ఇటూకాకి పర్వతారోహకురాలిగా మంచి గుర్తింపు ఉంది. జపాన్ లోని 3,067 మీటర్ల ఎత్తైన మౌంట్ ఆన్టేక్ పర్వతాన్ని టొమికా ఇటూకా రెండు సార్లు అధిరోహించారు.