TELUGU  NEWS AND MOVIES
  • Terms
  • Policy
  • Disclaimer
TELUGU  NEWS AND MOVIES
  • Home
  • Listen Audio Songs
  • Latest News
  • News Videos
  • Cricket Scores
HomeIron Deficiency: మహిళల్లో రక్తహీనత నివారించాలంటే.. పొద్దున్నే ఖాళీ కడుపుతో ఈ రెండు తీసుకుంటే సరి

Iron Deficiency: మహిళల్లో రక్తహీనత నివారించాలంటే.. పొద్దున్నే ఖాళీ కడుపుతో ఈ రెండు తీసుకుంటే సరి

Iron Deficiency 1

మనలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. ముఖ్యంగా మహిళల్లో ఈ వ్యాధి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఐరన్ లోపం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా రక్తహీణత సమస్య పుట్టుకొస్తుంది. దీంతో రకరకాల సమస్యలు ఒక్కొక్కటిగా కనిపించడం మొదలవుతాయి. మైకం, రోజంతా అలసట, ఎక్కువ శ్రమ లేకుండానే అలసి పోయినట్లు అనిపించడం, చేతులు - కాళ్ళు చల్లగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Iron Deficiency 2

రక్తంలో తక్కువ ఆక్సిజన్ స్థాయిలు ఉన్నా, ప్రసవం లేదా బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం ఉన్నా మరణానికి దారితీయవచ్చు. కాబట్టి సమయానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఐరన్ లోపాన్ని తగ్గించుకోవాలంటే కేవలం మందులు మాత్రమే తీసుకుంటే సరిపోదు. దీనితోపాటు రోజువారీ ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేయడం అవసరం. ముఖ్యంగా రోజువారీ ఆహారంలో ఈ కింది 4 ఆహారాలను చేర్చుకోవాలి. ఇవి శరీరంలో ఐరన్‌ లోపాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

Iron Deficiency 5

సలాడ్‌గా లేదా కూరలలో బీట్ రూట్‌, క్యారెట్‌లను రోజువారీ డైట్‌లో చేర్చుకోవడం అవసరం. అలాగే బీట్‌రూట్, క్యారెట్‌లను బ్లెండర్‌లో కలిపి వడగట్టి జ్యూస్‌లు మాదిరి కూడా తీసుకోవచ్చు. ఇందులో రుచి కోసం కొద్దిగా నిమ్మరసం, అల్లం మిక్స్ చేస్తే తాగేందుకు బాగుంటుంది.

Iron Deficiency 3

రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణంగా ఉన్నట్లయితే ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 10-12 ఎండు ద్రాక్షలు, కొన్ని ఖర్జూరాలను తినడం అలవాటు చేసుకోవచ్చు. విటమిన్ ఎ, సి, మెగ్నీషియం, రాగి, ఐరన్ అధికంగా ఉండే ఎండుద్రాక్ష, ఖర్జూరాలు రక్తంలో ఐరన్ లోపానికి భర్తీ చేస్తాయి.

Iron Deficiency 4

చాలా మంది నువ్వులను వంటలో ఉపయోగిస్తారు. ఐరన్, కాపర్, జింక్, సెలీనియం, విటమిన్ బి6, ఫోలేట్‌, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్న నువ్వులు శరీరంలో ఐరన్ పరిమాణాన్ని పెంచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. దానిమ్మ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. దానిమ్మలోని పోషకాలు శరీరంలో ఐరన్‌ లోపాన్ని కూడా తొలగిస్తుంది.

  • Facebook
  • Twitter
  • Newer

  • Older

gopal

Posted by gopal

You may like these posts

Menu Footer Widget

  • Home
Created By Themes

Contact form