Devara Movie Review: దేవర సినిమా రివ్యూ

|| || || Leave a comments
ప్రధాన కథనం: జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా అరవింద సమేత వీర రాఘవ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆరేళ్లు పూర్తయ్యాయి. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన సోలో హీరోగా వస్తున్న దేవర సినిమా మీద భారీ అంచనాలున్నాయి. కొరటాల శివ ఆచార్య తర్వాత చేస్తున్న సినిమా కావడం, జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకు పెరుగుతూ వెళ్లాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్ కట్స్ సినిమా మీద అంచనాలను మరింత పెంచగా ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి సుమారు 500 పైగా షోస్ ఇండియాలో పడగా అమెరికాలో కూడా దాదాపుగా చాలా ప్రీమియర్స్ పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. నాయకుడు దేవర నేపథ్యం ఏంటి? నిఘా వర్గాల హెచ్చరికలతో 1996లో యతి అనే ఒక గ్యాంగ్ స్టార్ ను పట్టుకునేందుకు శివం (అజయ్) ఏపీ తమిళ నాడు బోర్డర్లో ఉన్న రత్నగిరి వెళ్తాడు. యతి కోసం వెళ్లిన శివం అదే ప్రాంతానికి చెందిన దేవర (ఎన్టీఆర్) గురించి సింగప్ప(ప్రకాష్ రాజ్) ద్వారా తెలుసుకుని షాక్ అవుతాడు. చిన్నప్పుడే సొర చేపను చంపి ఒడ్డుకు తెచ్చేంత తెగువున్న దేవర తన వారైన రాయప్ప(శ్రీకాంత్), భైరా (సైఫ్ అలీఖాన్), కుంజ (కళయరసన్), కోర (షేన్ చామ్ టాకో) తో కలిసి పెద్ద పెద్ద షిప్స్ నుంచి మురుగా (మురళి శర్మ) కోసం దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అలాంటి దేవర ఒక ద