భారత్ కాదు, ఆ దేశమే గొప్ప: కోట్లలో సంపాదించినా జీరో ట్యాక్స్!

భారత్ కాదు.. ఈ దేశమే గొప్ప! కోట్లలో సంపాదించినా.. జీరో ట్యాక్స్!

ప్రపంచంలో ఎక్కడ చూసినా కుటుంబానికి, పిల్లల పెంపకానికి పెద్దపీట వేస్తున్నారు. తమ దేశంలోని పౌరుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు కూడా ప్రవేశ పెడుతున్నారు. ఈ క్రమంలోనే పోలాండ్ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలకు పర్సనల్ ఇన్‌కమ్ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేసింది. దీంతో ఆ కుటుంబాలకు సంవత్సరానికి 2,90,000 రూపాయలు(ప్రస్తుత మారకం రేటు ప్రకారం) ఆదా అవుతాయి. అంటే నెలకు 24,000 రూపాయలకు పైగా లాభం చేకూరుతుంది. ఈ మొత్తం ఆ కుటుంబాలు తమ ఇష్టం వచ్చిన విధంగా ఖర్చు పెట్టుకోవచ్చు. ఈ కొత్త చట్టం.. మధ్య, అధిక ఆదాయం ఉన్న కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆదాయంతో వారు తమ పిల్లల విద్య, ఆరోగ్యంపై ఖర్చు పెట్టుకోవచ్చు. తమ కాళ్లపై తాము నిలబడేలా వారిని తీర్చిదిద్దుకోవచ్చు.

పోలాండ్.. యూరప్‌లో తొలి దేశంగా..

పోలాండ్.. యూరప్‌లో తొలిసారిగా తన దేశంలోని పౌరులకు ఇన్ని సౌకర్యాలిచ్చే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశ పెట్టింది. తాజాగా పర్సనల్ ఇన్‌కమ్ ట్యాక్స్ రద్దుకు సంబంధించి చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం.. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలకు ఇన్‌కమ్ ట్యాక్స్ ఉండదు. అంటే ఎంత సంపాదించినా.. వారిపై ట్యాక్స్ ఉండదు. ఈ చట్టం జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది ముగిసేలోపు కనీసం ఇద్దరు పిల్లలను కన్న కుటుంబాలకు ఈ సౌకర్యం వర్తిస్తుందని పోలాండ్ ప్రభుత్వం తెలిపింది.

పిల్లల కోసం ఓ మంచి ప్రోగ్రామ్..

పోలాండ్ ప్రభుత్వం.. తమ దేశ జనాభా పెంపునకు కూడా ఈ చట్టం దోహదం చేస్తుందని భావిస్తోంది. ఎందుకంటే.. ఎక్కువ మంది పిల్లలను కనడానికి ఈ చట్టం ప్రోత్సాహం ఇస్తుంది. అంతేకాదు.. ఎక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలను.. పిల్లల్ని కనడానికి, వారిని పెంచడానికి ప్రోత్సహిస్తుంది. అలాగే విద్య, వైద్యం కోసం ఖర్చు పెట్టేందుకు వీలు కల్పిస్తుంది. తమ పిల్లలకు మెరుగైన భవిష్యత్తును కల్పించేందుకు వీలు కల్పిస్తుంది. పోలాండ్‌లో ఇప్పటికే '500+' అనే ప్రోగ్రామ్ అమల్లో ఉంది. దీని ప్రకారం.. మూడేళ్ల లోపు పిల్లలున్న కుటుంబాలకు న