పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో నెలకొన్నాయి. ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది. ముర్షిదాబాద్‌లో బాబ్రీ మసీదు తరహాలో మసీదు నిర్మించాలంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందు కబీర్ ప్రతిపాదన పెట్టాడు. అయితే, మమతా బెనర్జీ ఈ ప్రతిపాదనను తిరస్కరించడంతో పాటు, కబీర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
అయినప్పటికీ, హుమాయున్ కబీర్ తన దూకుడును తగ్గించుకోలేదు. శనివారం, మూడు లక్షల మందితో ముర్షిదాబాద్‌లో బాబ్రీ మసీదు శంకుస్థాపనకు పూనుకున్నారు. ఈ కార్యక్రమం కోసం కబీర్ భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో, బెంగాల్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
బాబ్రీ మసీదు శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. అరబ్ దేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రత్యేక అతిథులు వస్తున్నట్లుగా తెలుస్తోంది. భారీ ఎత్తున భోజన ఏర్పాట్లు, సభ కోసం పెద్ద ఎత్తున స్టేజ్ ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. ఈ కార్యక్రమాన్ని నిలిపివేసేందుకు కోల్‌కతా హైకోర్టు కూడా నిరాకరించింది. శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాలని తెలిపింది.
ఈ వ్యవహారంపై గవర్నర్ సీవీ ఆనంద బోస్ స్పందించారు. రెచ్చగొట్టే ప్రకటనలు, పుకార్లతో మోసపోవద్దని ప్రజలను కోరారు. ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
ప్రస్తుతం, ముర్షిదాబాద్‌లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. జాతీయ రహదారి -12కి ఇరువైపులా రాష్ట్ర, కేంద్ర బలగాలు మోహరించారు. 3,000 మంది సిబ్బంది మోహరించినట్లుగా ఒక సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. హుమాయున్ కబీర్ దూకుడు, మమతా బెనర్జీ ప్రభుత్వం, మరియు గవర్నర్ సీవీ ఆనంద బోస్ స్పందనలు ఈ ఉద్రిక్తతలను మరింతగా పెంచుతున్నాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర