Actress Ananya Pandey
సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూనే ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఏ సినిమాలో నటించినా కూడా అద్భుతంగా రాణిస్తదన్న పేరు ఉంది. ఎందుకంటే ఆమె నటి మాత్రమే కాదు.. మోడల్ కూడా. ఈమె ప్రముఖ సినిమా నటుడు చుంకీ పాండే కుమార్తె. ఈమెకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. తాజాగా ఈ ముద్దుగుమ్మ పలు ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి.
అనన్య పాండే.. 2019లో టీన్ ఫిల్మ్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మరియు కామెడీ పతి పత్నీ ఔర్ ఓ పాత్రలతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.
ఆ పాత్రల్లో అద్భుతంగా నటించి ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నది.
ఆ తరువాత కూడా నటించిన మరో రెండు సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
అప్పటి నుంచి ఆమెకు భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
అయితే, ఈ అమ్మడు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా పలు ఫొటోలకు ఫోజులిచ్చింది.
ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇప్పుడా ఆ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.