Ghattamaneni Jayakrishna: ఘట్టమనేని హీరో టాలీవుడ్ ఎంట్రీ.. షురూ

|| || || Leave a comments

Ghattamaneni Jayakrishna

 వారసుల కోసం టాలీవుడ్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోంది. ఇప్పటివరకు స్టార్ హీరోలకు ఫ్యాన్స్ గా ఉన్నవారు వారి వారసులకు కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధపడ్డారు. అలా టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తున్న వారసుల లిస్ట్ లో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ , పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా, మహేష్ బాబు కొడుకు గౌతమ్ ముందు వారసులో ఉన్నారు. ఈ ముగ్గురులో మోక్షజ్ఞ ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఇక అకీరా.. ప్రస్తుతం నటనలో శిక్షణ కన్నా సంగీతంపై ఫోకస్ పెట్టాడు. త్వరలోనే అకీరా ఎంట్రీ కూడా కన్ఫర్మ్ అవుతుంది . పవన్ రాజకీయాలతో బిజీగా ఉంది సినిమాలు వదిలేస్తే.. కచ్చితంగా అకీరా ఎంట్రీపై ఒత్తిడి పెరుగుతుంది. ఇక వీరిద్దరి తరువాత అందరి చూపు ఘట్టమనేని హీరో గౌతమ్ పై ఉంది.

 ఈ మధ్యనే గౌతమ్ తండ్రి బాటలోనే ఫిట్ నెస్ పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఇంకా గౌతమ్ చదువు పూర్తికాలేదు. ఇప్పుడప్పుడే ఈ కుర్రాడు టాలీవుడ్ కు వచ్చే ప్రసక్తే లేదు అని తెలుస్తోంది. ఇక ఈలోపు మరో ఘట్టమనేని కుర్రాడు ప్రేక్షకులకు అలరించడానికి రెడీ అవుతున్నాడు. అతడే ఘట్టమనేని జయకృష్ణ. మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు. తండ్రి రమేష్ బాబు చనిపోయాక.. జయకృష్ణ బాధ్యతలను మహేష్ బాబునే తీసుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఉన్నత విద్యను పూర్తిచేసిన జయకృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి రెడీ అయ్యాడు. జయకృష్ణ తొలిసారి.. కృష్ణ స్మారక సభలో మీడియా కంట పడ్డాడు. పట్టు పంచె కట్టుకొని అటు ఇటు తిరుగుతుంటే హీరో మెటీరియల్ లానే అనిపించాడని అప్పట్లో కామెంట్స్ వినిపించాయి. 


ఇంకా చెప్పాలంటే గౌతమ్ కన్నా ముందు జయకృష్ణనే హీరోగా పరిచయం కావాలి. మహేష్ కన్నా ముందు రమేష్ బాబునే కృష్ణ హీరోగా పరిచయం చేసాడు. ఇప్పుడు ఆ ఇద్దరి అన్నదమ్ములలానే ఈ ఇద్దరు అన్నదమ్ములు.. ఒకరి తరువాత ఒకరు రెడీ అవుతున్నారు. తాజాగా జయకృష్ణ ఫోటోషూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నేవీ బ్లూ సూట్ లో జయకృష్ణ తండ్రి, తాత పోలికలతో కనిపించి షాక్ ఇచ్చాడు. చిన్నాన్నలానే మెరిసిపోయే రూపంతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం జయకృష్ణ ఫోటోలను చూసిన అభిమానులు.. చిన్నోడు వచ్చేలోపు పెద్దోడు అలరిస్తాడులే అని కామెంట్స్ పెడుతున్నారు.