ఈ నెల 28న జరిగే మంత్రి మండలి సమావేశంలో విజన్ డాక్యుమెంట్ 2047 ను ప్రతిపాదించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
ప్రభుత్వ విజన్‌పై చర్చలు జరిపాం.. ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీపై సీఎం ట్వీట్
సెప్టెంబరు 1 నుండి 15 వరకూ విజన్ డాక్యుమెంట్‌పై ప్రజల నుంచి సూచనలు, అభిప్రాయాల సేకరణ జరుగుతుందన్నారు ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. సెప్టెంబరు 10-15 మధ్య మండల, మున్సిపల్, గ్రామస్థాయి అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.
వచ్చేనెల 10-14 మధ్య ఉన్నత పాఠశాలల విద్యార్ధినీ, విద్యార్ధులకు పోటీల నిర్వహణ జరుగుతుందన్నారు.సెప్టెంబరు 15-24 మధ్య ఏపీ విజన్ 2047 ముసాయిదా ఖరారు జరుగుతుందని తెలిపారు. సెప్టెంబరు 25న వికసిత్ ఏపీ విజన్ 2047 తుది ముసాయిదా సమర్పిస్తామన్నారు.