ఆరోగ్యానికి కేవలం కూరగాయలు, పండ్లతో మాత్రమే కాకుండా గింజలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఫ్లాక్స్ సీడ్స్ తినడం వల్ల ఆరోగ్యానికి పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా ప్రతీ రోజూ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.
అంతేకాదు ముఖ్యంగా నానబెట్టిన అవిసె గింజలను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థకు సంబంధించిన చాలా రకాల సమస్యలను కూడా అవిసె గింజలను తినడం వల్ల తగ్గించుకోవచ్చు. ఇందులో మలబద్ధకం, కడుపులో గ్యాస్, అజీర్ణం వంటి వాటి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్ కారణంగా ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.