పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- దర్శకుడు సుజిత్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా ఓజీ. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడం, డిప్యూటీ సిఎమ్ కావడంతో సినిమా అలా పక్కన వుండిపోయింది. కానీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడు అప్ డేట్ వస్తుందా.. ఎప్పుడు సినిమా వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
నిర్మాత దానయ్య ఎప్పుడు హీరో పవన్ సెట్ మీదకు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పవన్ బర్త్ డే రాబోతోంది. ఈ సందర్భంగా ఏమైనా కంటెంట్ అయినా వస్తుందా అని ఫ్యాన్స్ తెగ అడుగుతున్నారు. నిర్మాత దానయ్య కూడా సమ్ థింగ్ వుంటుందనే హింట్ ఇచ్చారు.
అయితే పవన్ బర్త్ డే నాడు వదలడం కోసం మూడు కంటెంట్ లు రెడీ చేస్తున్నారు. ఒకటి మంచి పోస్టర్. రెండు మంచి టీజర్. మూడోది సాంగ్. అయితే మూడూ వదలరు. ఏదో ఒకటి మాత్రమే వదిలే అవకాశం ఎక్కువ వుంది. ఏది వదలాలి అన్నది దర్శకుడు- హీరో కలిసి డిస్కస్ చేసి డిసైడ్ చేసుకుంటారు. ముందుగా ఈ నెలాఖరులోగా ఈ మూడూ రెడీ చేసి హీరో పవన్ కు చూపిస్తారు. అప్పుడు పవన్ డెసిషన్ మేరకు డిసైడ్ అవుతారు ఏది వదలాలి అన్నది.
ఓజీ సినిమాకు బిజినెస్ సర్కిళ్లలో, ఫ్యాన్స్ లో మంచి క్రేజ్ వుంది. సుజిత్ గతంలో సాహో సినిమా ఏ రేంజ్ లో తీసాడు అన్నది తెలిసిందే. ఈ జనరేషన్ కు నచ్చే టేకింగ్, భారీతనం ఓజీలో వుంటాయి. అందుకే క్రేజ్ బాగా వుంది.