Hyderabad: భర్య చేతిలో భర్త హతం.. మియాపూర్ లో ఘటన
gopal || || hyderabad news || Leave a comments
మియాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. భార్య చేతిలో భర్త హత్యకు గురయ్యాడు. కుటుంబ కలహాలతోనే హత్య చేసినట్లు గుర్తింపు. పోలీసుల కథనం ప్రకారం. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవవి. అస్సాంకు చెందిన రుక్సానా(35) భర్తతో కలిసి హఫీజ్ పేట్ ప్రేమ్ నగర్ లో నివాసం ఉండేవారు. భార్యాభర్తలు కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవారు.
భర్త రోజూ తాగి వచ్చి భార్యను వేధిస్తుండేవాడు. ఇంతటితో ఆగకుండా భర్త బుధవారం పిల్లలపై కత్తితో దాడికి యత్నించాడు. పిల్లలను కొట్టడంతో భార్య రుక్సనా విసిగిపోయింది. భార్య తీవ్రంగా ప్రతిఘటించడంతో భర్త తలకు తీవ్ర గాయమైంది. అధిక రక్త స్రావంతో భర్త మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.