Lavanya : హీరోయిన్లతో అఫైర్స్ ఉన్నా రాజ్ అంటే ప్రాణం.. లావణ్య సంచలనం

|| || || Leave a comments
రాజ్ తరుణ్ కి పలువురు హీరోయిన్లతో అఫైర్స్ ఉన్నాయని లావణ్య చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ మీద గతంలో లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా ఆమెకు అనుకూలంగా పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన క్రమంలో ఆమె ఎన్టీవీతో మాట్లాడింది. ఈ సమయంలో మీరు గతంలో రాజ్ తరుణ్ కి పలువురు హీరోయిన్లతో అఫైర్స్ ఉన్నాయని మీడియా ముందే కామెంట్ చేశారు అవి నిజమేనా అని అడిగితే అవును నిజమేనని లావణ్య చెప్పుకొచ్చింది. 

 ప్రశ్న: రాజ్ తరుణ్ మాత్రం వాళ్లు తన సహ నటులు మాత్రమే అని చెబుతున్నారు దీనికి ఏమైనా క్లారిఫికేషన్ ఇవ్వగలరా అని అడిగితే ఖచ్చితంగా అతనికి అఫైర్స్ ఉన్నాయని నాకు తెలుసు. అతను ఆరుగురు హీరోయిన్లతో కలిసి అఫైర్స్ చేశాడు. ఆయనకు లవర్ సినిమా హీరోయిన్ రిద్దీ, అరియనా, శాలిని పాండే సహా ఇంకో ఇద్దరితో అఫైర్స్ ఉన్నాయని ఆమె అన్నారు. ప్రశ్న: ఆయనతో చేసిన హీరోయిన్ అందరి పేర్లు మీరు చెబుతున్నారు కదా అని అడిగితే అతను దగ్గర దగ్గర 30 సినిమాలు దాకా చేశాడు. హెబ్బా పటేల్ పేరు చెప్పానా, అవికా గోర్ పేరు చెప్పానా భలే ఉన్నాడే సినిమా హీరోయిన్ పేరు చెప్పానా? లేక పురుషోత్తముడు సినిమా హీరోయిన్ పేరు చెప్పానా? అని ప్రశ్నించారు. లావణ్య జవాబు: నా దగ్గర ఉన్న ఆధారాలను మీడియాకి కూడా ఇచ్చాను అని అన్నారు. 


మాల్వి మల్హోత్రాతో కూడా అతను క్లోజ్ గా లేడు అన్నారు కానీ వాళ్ళిద్దరి చాట్ హిస్టరీలు, ట్రావెల్ హిస్టరీ అన్ని బయట పెట్టాను అని అన్నారు, మాల్వి మల్హోత్రా వీడియోలు బయటపెట్టారు కానీ మిగతా వాళ్ళతో ఉన్న వీడియోలు కానీ చాట్ కానీ బయట పెట్టలేదు కదా అని అడిగితే పెట్టానండి డెఫినెట్గా ఉన్నాయి అని ఆమె అన్నారు. ప్రశ్న: రాజ్ తరుణ్ కి హీరోయిన్లతో అఫైర్స్ ఉన్నాయని తెలిసి కూడా ఆయన్ని ఎందుకు కోరుకుంటున్నారు? ఎందుకు ఆయన కోసం ఇంకా తాపత్రయపడుతున్నారు అంటే ఏం చెబుతారు? లావణ్య జవాబు: నేను అతనిని ప్రేమించాను, ప్రేమిస్తున్నాను అతను అంటే నాకు ఇష్టం, ప్రాణం అని ఆమె అన్నారు. అంత ప్రాణం అనుకున్నప్పుడు ఈ విషయాన్ని కూర్చుని మాట్లాడుకుని ఉండొచ్చు కదా ఇంత దాకా రావాల్సిన అవసరం ఏమి వచ్చింది అనే వాదన వినిపిస్తోంది దీనికి సంబంధించి మీరు ఏమన్నా అంటారా అంటే నేను మొదట్లో రాజ్ తరుణ్ మీద కేసు పెట్టలేదు.